లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక పేదలు అవస్థలు పడుతున్నారు. వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు, సామగ్రి అందిస్తున్నాయి. నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని షార్ ఉద్యోగుల సంఘాల నాయకులు పరిసరాల్లోని గ్రామాల్లో 100 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించారు. కరోనా వైరస్ సోకకుండా పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ ఉన్నందున అందరూ ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు.
పేదలకు అండగా షార్ ఉద్యోగులు
నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని షార్ ఉద్యోగుల సంఘాల నాయకులు పరిసరాల్లోని గ్రామాల్లో పేదలకు కూరగాయలు, నిత్యవసర వస్తువులు అందించారు.
పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేసిన షార్ ఉద్యోగులు