ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షార్​లో 'యువిక-2019'.. ముఖ్య అతిథిగా 'శివన్'

భారత ప్రభుత్వ దూరదృష్టిలో భాగంగా.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో యువిక-2019 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇస్రో ఛైర్మన్ శివన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

షార్​లో 'యువిక-2019'.. ముఖ్యఅతిథిగా 'శివన్'

By

Published : May 18, 2019, 8:34 AM IST

నాణ్యత, పారదర్శకతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇస్రో విజయవంతంగా ప్రయోగాలు చేస్తోందని ఇస్రో ఛైర్మన్ శివన్ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో 'యువిక-2019' కార్యక్రమంలో పాల్గొని.. విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. వారు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామనీ.. వివిధ రంగాల్లో విద్యార్థులను మెరికలుగా తయారు చేయడమే దీని లక్ష్యమని వివరించారు. యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. గగన్​యాన్ ప్రయాణం భూమికి 450 కిలోమీటర్ల దూరంలో వారంరోజులపాటు జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉంటే ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కాగలరన్నారు. అంతరిక్ష శకలాల నష్టాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి జరుగుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details