ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ ఆందోళన - SFI concerned over postponement of VSU degree exams

నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది.

SFI concerned over postponement of VSU degree exams
వి.ఎస్.యు డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ ఆందోళన

By

Published : Oct 12, 2020, 9:39 PM IST

నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. ఛలో యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా వీఎస్​యూను ఎస్ఎఫ్ఐ నేతలు ముట్టడించారు.

వర్సిటీ లోనికి విద్యార్థి నేతలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు, అధ్యాపకులు కరోనా బారినపడే అవకాశముందని విద్యార్థి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పిన మేరకు.. ఆందోళన విరమించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details