ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో వ్యభిచార గృహాల గుట్టురట్టు - నెల్లూరులో వ్యభిచార గృహ నిర్వాహకుడు అరెస్ట్

లఘుచిత్రాల్లో అవకాశం ఇస్తానంటూ మహిళలకు మాయమాటలు చెప్పి.. వారిని వ్యభిచారకూపంలో దించాడు ఓ ప్రబుద్ధుడు. గుట్టుచప్పుడు కాకుండా నెల్లూరులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తోన్నాడు. కోవూరుకు చెందిన ఓ బాలిక ఫిర్యాదుతో గుట్టువీడింది... నిందితుడు కటకటాలపాలయ్యాడు.

నెల్లూరులో వ్యభిచార గృహాల గుట్టురట్టు

By

Published : Nov 7, 2019, 8:51 PM IST

నెల్లూరులో వ్యభిచారగృహాల గుట్టురట్టైంది. లఘుచిత్రాల్లో అవకాశం ఇస్తానంటూ మహిళలను మోసం చేసి వ్యభిచారగృహాలు నిర్వహిస్తోన్న నిందితుడు షేక్ జాకీర్ హుస్సేన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవూరుకు చెందిన ఓ బాలిక ఫిర్యాదుతో వ్యభిచారగృహాల వ్యవహారం బయటపడింది. జాకీర్‌ నిర్వహిస్తున్న 7 వ్యభిచారగృహాలపై పోలీసులు దాడులు చేసి... 8 మంది నిర్వాహకులు, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బాధిత మహిళలను పునరావాస కేంద్రానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details