ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడికి తీవ్ర గాయాలు - ఉదయగిరి తాజా క్రైమ్ న్యూస్

విద్యుదాఘాతంతో యువకుడు తీవ్రంగా గాయపడి... తృటిలో ప్రాణాపాయం తప్పిన ఘటన ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో జరిగింది. పొలంలో ఫ్యూజు బిగించే క్రమంలో విద్యుత్తు ప్రసరించటంతో... ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

విద్యుదాఘాతంతో యువకుడికి తీవ్ర గాయాలు
విద్యుదాఘాతంతో యువకుడికి తీవ్ర గాయాలు

By

Published : Jun 9, 2020, 2:33 PM IST

విద్యుదాఘాతంతో యువకునికి తీవ్ర గాయాలైన ఘటన ఉదయగిరి మండలం అప్పసముద్రంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... అప్పసముద్రం గ్రామ సమీపంలోని చెరువు వద్ద ఉన్న పొలాల్లో గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు గడ్డి పెంపకం చేస్తున్నారు. పొలంలో ఉన్న విద్యుత్ నియంత్రిక వద్ద ఉండే స్తంభం ఎడ్జ్ ఫ్యూజు ఎగిరి పోవటంతో... ఫ్యూజు వేసేందుకు గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే యువకుడిని రైతుల పొలంలోకి తీసుకెళ్లారు.

అనంతరం లైన్​ మెన్​కు రైతులు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపి వేయాలని కోరారు. లైన్ మెన్ ఎల్సీ తీసుకున్నట్లు తెలపటంతో రైతులు యువకుడిని స్తంభం ఎక్కించారు. ఫ్యూజు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే రైతులు లైన్​ మెన్​కు విషయం చెప్పటంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. గాయాలతో స్తంభంపై ఉన్న యువకుడిని కిందకు దింపి వైద్యం కోసం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. యువకుడి ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పటంతో రైతులు, విద్యుత్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:కడుపు నొప్పి తట్టుకోలేక... తల్లిదండ్రులకు కడపు కోత మిగిల్చిన యువతి

ABOUT THE AUTHOR

...view details