రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు రొట్టెల పండుగ వైభవంగా ముగిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. రొట్టెలను మార్చుకునేందుకు వచ్చిన లక్షలాది భక్తులతో నెల్లూరు నగరం జనసంద్రంగా మారింది. విద్యా రొట్టె, ఆరోగ్య రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె, ఉద్యోగ రొట్టె ఇలా పలు రకాల రొట్టెలను భక్తులు మార్చుకున్నారు. వరాల రొట్టెలను పట్టుకునేందుకు విదేశాల నుంచీ వచ్చారు. ప్రాణత్యాగం చేసిన 12 మంది అమరవీరుల సమాధులను దర్శించుకున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకున్నారు. ఈ ఐదు రోజుల్లో ఏడు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
రొట్టెల పండుగకు... ఏడు లక్షల మంది భక్తుల రాక - rottela panduga
నెల్లూరులో ఐదురోజులు పాటు కన్నులపండువగా సాగిన బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ముగిసింది. లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమరవీరుల సమాధులను దర్శించుకున్నారు. రొట్టెలు మార్చుకుని, కోర్కెలు తీరాలంటూ వేడుకున్నారు.
రొట్టెల
వేడుకల్లో పాల్గొనడానికి తరలివచ్చిన లక్షలాది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేశారు. అన్నిరకాల వసతులు కల్పించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ద్య పరంగా నగరపాలక సంస్థ అధికారులు చక్కగా పనిచేశారని చెబుతున్నారు. అధికారికంగా వేడుకలు ముగిసినా భక్తుల రద్దీ ఇంకా తగ్గలేదు. వేడుకలు అనధికారింకగా మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలున్నాయి.