నెల్లూరు జిల్లాలో రేషన్ తీసుకునే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వర్లు పనిచేయక రేషన్ దుకాణాలు వద్ద పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు. రోజుకు 50 మందికి రేషన్ ఇవ్వాల్చి ఉండగా.. సర్వర్లు పనిచేయక ముగ్గురుకి మించి ఇవ్వలేకపోతున్నట్లు తెలపడంతో వినియోగదారులు ప్రతిరోజు వచ్చి తిరిగి వెళ్తున్నారు. అయితే ఈ రోజు సర్వర్లు అసలు పని చేయకపోవడం వల్ల దుకాణాల వద్ద వినియోగదారులు పడిగాపులు కాశారు.
మొరాయించిన సర్వర్లు.. రేషన్ కోసం తప్పని పడిగాపులు - ration shops in nellore district news update
సర్వర్లు పని చేయక రేషన్ దుకాణాల వద్ద వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. పనులు మానుకొని రేషన్ కోసం వేచి చూడాల్సి వస్తుందంటూ వినియోగదారులు అవేదన వ్యక్తం చేస్తుండగా.. సర్వర్లు మొరాయించడం వల్లే రేషన్ ఇవ్వలేకపోతున్నట్లు డీలర్లు చెబుతున్నారు.
![మొరాయించిన సర్వర్లు.. రేషన్ కోసం తప్పని పడిగాపులు servers are not working in ration shops](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9474940-107-9474940-1604823807790.jpg)
రేషన్ షాపుల్లో మోరాయించిన సర్వర్లు