ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

12 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.. ఒకరి అరెస్టు - nellore, kavali

నెల్లూరు జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్యాకెట్లను కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఎవరైనా గుట్కా ప్యాకెట్లు అమ్మినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

గుట్కా ప్యాకెట్లు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

By

Published : Aug 5, 2019, 7:50 AM IST

గుట్కా ప్యాకెట్లు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో భారీగా గుట్కా ప్యాకెట్లు ఒకటో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కావలిలోని రాఘవయ్య అనే వ్యక్తి ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయని సమాచారం రాగా... సీఐ రోశయ్య, ఎస్సై వెంకటరావులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12980 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు లక్ష రూపాయలకుపైగా ఉండవచ్చని ఆయన వివరించారు. రాఘవయ్య అనే వ్యక్తి ఈ ప్యాకెట్లను కొనుగోలు చేసి... వాటిని కావలి పట్టణంలో ఉన్న చిన్నచిన్న దుకాణాల్లో అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించామని సీఐ రోశయ్య తెలిపారు. దీంతో నిందితుణ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వ్యాపారస్తులు నిషేధంలో ఉన్న గుట్కా ప్యాకెట్లను అమ్మకూడదని... అమ్మినట్లు గాని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details