గ్రావెల్ అక్రమ తవ్వకాలపై అధికారుల ఉక్కుపాదం...24 వాహనాలు సీజ్ - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 19 టిప్పర్లు, ట్రాక్టర్ను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో నుంచి గ్రావెల్ తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
వాహనాలను సీజ్ చేసిన అధికారులు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామపంచాయతీలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 19 టిప్పర్లు, 4 హిటాచీలు ఒక ట్రాక్టర్ను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో నుంచి రైల్వే శాఖకు గ్రావెల్ తరలిస్తున్నారు. ఇది గుర్తించిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.