ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న వెయ్యి బస్తాల ఉప్పుడు బియ్యం స్వాధీనం - Seizure of rice in Nellore district

వెయ్యి బస్తాల ఉప్పుడు బియ్యాన్ని లారీలలో అక్రమంగా తరలిస్తుండగా నెల్లూరు జిల్లాలో సివిల్‌ సప్లై అధికారులు పట్టుకున్నారు. జీఎస్టీ పత్రాలు సరిగ్గా లేవని వాటిని స్థానిక గోదాములోకి తరలించారు. తమిళనాడు నుంచి కాకినాడ మిల్లుకు ఉప్పుడు బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Seized a thousand bags of rice
ఉప్పుడు బియ్యం బస్తాలు స్వాధీనం

By

Published : Nov 29, 2020, 3:32 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న వెయ్యి ఉప్పుడు బియ్యం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు లారీలలో అక్రమంగా రవాణా చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వారి ఆదేశాలు మేరకు స్థానిక అధికారులు తనిఖీ చేసి జీఎస్టీ పత్రాలు సరిగ్గా లేవని గుర్తించారు. స్థానిక సివిల్‌ సప్లై గోదాము వద్దకు రెండు లారీలను తరలించారు.

తమిళనాడులోని చెన్నై సివిల్ సప్లై ద్వారా కాకినాడ మిల్లుకు ఉప్పుడు బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాహనాలను స్వాధీనంలో ఉంచుతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details