నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు పట్టుకున్నారు. చేజర్ల మండలం పెరుమాళ్లపాడు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్సై వీరనారాయణ హెచ్చరించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్ - Police arrest sand smugglers in Nellore
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను మర్రిపాడు మండలం నందవరం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
![అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్ Seize four trucks moving](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9773357-543-9773357-1607163098216.jpg)
ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్