నెల్లూరు జిల్లాలో రెండో పంట పనులు ప్రారంభమైయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఆంక్షలు సడలించింది.పెన్నా డెల్టా కింద 1.80 లక్షల ఎకరాలు, సోమశిల కింద 67,500 ఎకరాలు కలిపి మొత్తం 2,47,500 ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. 27.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో రైతులు సాగు పనులు ప్రారంభించారు. దుక్కులు, నారుమళ్లు సిద్ధం చేసుకోవడం, కొన్ని చోట్ల నారుమడుల్లో విత్తనాలు చల్లటం వంటి పనులను చేస్తున్నారు. వరి సాగుకు 49,500 క్వింటాళ్ల వివిధ రకాల వరి విత్తనాలు అవసరమవుతాయని అధికారులు అంచనాలు వేశారు. యూరియా, డీఏపీ, ఎంవోపీ, కాంప్లెక్స్, ఎస్‌ఎస్‌పీ ఎరువులు 72,500 మెట్రిక్ టన్నులు కావాలని అంచనాలు వేయగా.. ఇప్పటికే ఇందులో 65 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వ్యవసాయానికి యంత్ర పరికరాల రవాణా, భౌతిక దూరం పాటిస్తూ కూలీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనులు చేసుకోవచ్చని, ఆ సమయం వరకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మే దుకాణాలు ఉంటాయని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ చెబుతోంది.
ప్రతికూల పరిస్థితుల్లో మొదలైన రెండో పంట పనులు - india fights against carona
మునుపెన్నడూ చూడని ప్రతికూల పరిస్థితుల్లో రెండో పంట సాగు పనులు మొదలయ్యాయి. సాగునీరు లేక గత రెండు పర్యాయాలు ఎడగారు నిరాశాజనకంగానే సాగింది. ఈసారి జలాశయాల్లో నీరుండటంతో రెండో పంటకు నీటిని అధికార యంత్రాంగం విడుదల చేసింది. రైతులు ఇబ్బందులకు గురి కాకుండా లాక్‌డౌన్ ఆంక్షలను కొంత సడలించి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆశతో సాగుకు సన్నద్ధమయ్యారు.
Breaking News