ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే: ఎస్ఈసీ - నెల్లూరులో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సమావేశం వార్తలు

ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యం కిందకే వస్తుందని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హెచ్చరించారు. నాయకత్వ బాధ్యతల కోసం పోటీపడడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. అధికసంఖ్యలో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోవాలని నెల్లూరులో విజ్ఞప్తి చేశారు.

Sec nimmagadda press meet in Nellore
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

By

Published : Feb 4, 2021, 11:37 AM IST

Updated : Feb 4, 2021, 1:37 PM IST

ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అధికారులు పని చేస్తారని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ అందరూ కలిసే ఉంటారని.. అప్పటివరకే ఇలాంటి విభేదాలని అన్నారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియీ సమావేశం

ఎన్నిలను నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆయన కోరారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ను ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యం కిందకే వస్తుందని నిమ్మగడ్డ ఉద్ఘాటించారు. ఎన్నికల విషయంలో చాలా గ్రామాలు ఒకే ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాయని.. ఆదర్శవంతంగా స్పందించాయని ప్రశంసించారు. నాయకత్వ బాధ్యతల కోసం పోటీపడడం శుభపరిణామమన్న ఆయన.. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:

అచ్చెన్న బెయిల్ పిటిషన్‌.. నేడు సోంపేట న్యాయస్థానంలో విచారణ

Last Updated : Feb 4, 2021, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details