నెల్లూరు జిల్లా గంపర్లపాడులో ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఎస్‌ఈబీ(SEB) అధికారులు అడ్డుకున్నారు. అయితే అధికారులను చూసి..ఆపకుండా నాలుగు ఇసుక ట్రాక్టర్లు పరారయ్యాయి. ఒక ట్రాక్టర్‌ను పట్టుకుని అధికారులు సీజ్ చేశారు. మరో 3 ట్రాక్టర్ల కోసం గాలిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలువురిపై ఎ.ఎస్.పేట పీఎస్‌లో ఎస్‌ఈబీ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
sand mafia: అధికారులను చూసి పరారైన ఇసుక ట్రాక్టర్లు - నెల్లూరు ఇసుక మాఫియాను పట్టుకున్న పోలీసులు న్యూస్
నెల్లూరు(nellore) జిల్లా ఎ.ఎస్.పేట మండలం గంపర్లపాడులో ఇసుక మాఫియా(sand mafia) చెలరేగిపోతోంది. ఎస్‌ఈబీ అధికారులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడంతో ఇసుక ట్రాక్టర్లను తీసుకుని పరారయ్యారు.
![sand mafia: అధికారులను చూసి పరారైన ఇసుక ట్రాక్టర్లు SEB officers caught sand mafia in nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12369802-1060-12369802-1625552918011.jpg)
SEB officers caught sand mafia in nellore