ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాసేపట్లో నింగిలోకి పీఎస్ఎల్వీ.. కొనసాగుతున్న కౌంట్​డౌన్ - ఇస్రో ఛైర్మన్ శివన్ తాజా సమాచారం

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక కోసం శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. నేడు ఉదయం 10.24గంటలకు.. ఈ వాహక నౌకను నింగిలోకి పంపనున్నారు.

PSLV C51 carrier
నేడు నింగిని చేరనున్న పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక

By

Published : Feb 28, 2021, 8:45 AM IST

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్​) నుంచి కాసేపట్లో.. పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌకను ప్రయోగించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ప్రీకౌంట్ డౌన్ మెుదలైంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం నిన్న ఉదయం 8.24 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. 26 గంటల పాటు నిరంతరాయంగా కౌన్ డౌన్ కొనసాగి.. ఈ ఉదయం 10.24గంటలకు అంతరిక్షంలోకి పీఎస్ఎల్వీ దూసుకుపోనుంది.

ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్​కు చెందిన అమోజోనియా-1, మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే షార్​కు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు చేరుకున్నారు. ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ కైలాస వాడివో శివన్ పర్యవేక్షించనున్నారు.

చెంగాళమ్మకు పూజలు

శ్రీహరికోటకు ఆనుకుని ఉండే.. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి అధికారులు శివన్​ దంపతులకు స్వాగతం పలికారు. నేడు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక విజయవంతం కావాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి:

విశాఖ రైల్వే జోన్‌ ప్రకటనకు రెండేళ్లు.. నేటికీ కానరాని పురోగతి!

ABOUT THE AUTHOR

...view details