నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 22న చంద్రయాన్ -2 ప్రయోగించనున్నారు. ఈనెల 15 వేకువ జామున గం 2.51 లకు జరగాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. క్రయోజనిక్ ఇంజన్‌లోని హీలియం బాటిల్ జాయింట్ వద్ద లీకేజీని శాస్త్రవేత్తలు సరిచేశారు. 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్కు-3 వాహకనౌక ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు పట్టుదలతో పని చేస్తున్నారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.నేడు రాకెట్ సన్నద్ధతపై సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.
ఈ నెల 22న నింగిలోకి చంద్రయాన్-2 - shar
శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈనెల 22న చంద్రయాన్-2 ప్రయోగం జరిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రయాన్-2