ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా అన్ని వసతులతో జిల్లాలో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ నాయకుల పిల్లలు, అధికారుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా జీవో విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రదర్శనలో దాదాపు 250కిపైగా నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. విజ్ఞాన శాస్త్రం, గణితశాస్త్రం, పర్యావరణాలకు సంబంధించిన నమూనాలు ఆకట్టుకున్నాయి.
నెల్లూరు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన
నెల్లూరు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. జలవనరుల శాఖ మంత్రి అనిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని తెలిపారు.
నెల్లూరు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన