నెల్లూరు జిల్లా కావలి మండలంలోని సర్వాయిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు 317 మంది బాలబాలికలు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో 12 తరగతి గదులు ఉన్నాయి అందులో ఆరు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. మిగిలిన గదులు వర్షం వచ్చిందంటే భవనం పెచ్చులూడి కింద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఏ క్షణంలో ఏం ప్రమాదం జరుగుతుందోనని పిల్లలు బిక్కుబిక్కుమంటున్నారు. అంతేగాక మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. అధికారులు, నాయకులు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారే తప్ప పట్టించుకున్న దాఖలాలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు సమస్యలను గుర్తించి మౌలిక వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు.
సార్..మా పాఠశాలను పట్టించుకోండి! - నెల్లూరు సర్వాయిపాలెం ఉన్నతపాఠశాల సమస్యల వార్తలు
చదువుకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వసతుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా సర్వాయిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు అరకొర వసతుల మధ్య చదువును సాగిస్తున్న దుస్థితిపై ప్రత్యేక కథనం

సర్వాయిపాలెం ఉన్నత పాఠశాల