SAND DUMPING:నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ. ఎక్కడో నదీతీరాల్లో.. ఉండాల్సిన ఇసుక తిన్నెలు ఇక్కడ ఉన్నాయేంటనేగా సందేహం. మన అధికారులు.. ఎక్కడా ఖాళీ స్థలమే లేనట్లు..ఈ పాఠశాల ఆవరణనే ఇసుక డంపింగ్ యార్డ్‌గా మార్చేశారు. కోవూరు మండలంలోని పాఠశాలల్లో.. నాడు-నేడు అభివృద్ధి పనుల కోసం అధికారులు ఇసుక సేకరించారు. గుమ్మళ్లదిబ్బ పాఠశాల ఆవరణను ఏకంగా స్టాక్ పాయింట్‌గా మార్చేశారు. వేసవి సెలవుల్లో.. టిప్పర్ల కొద్దీ ఇసుక డంప్ చేయించారు.
అధికారుల నిర్లక్ష్యం.. డంపింగ్ యార్డుగా పాఠశాల
SAND DUMPING: ఆ పాఠశాలకు ఆట స్థలం ఉంది. కాకపోతే.. పిల్లలకు అక్కరకు రావడం లేదు.! 'మనబడి-నాడు-నేడు' పనుల కోసం అంటూ పాఠశాల ఆవరణను.. ఇసుక దిబ్బగా మార్చేశారు. పనులు సకాలంలో పూర్తి చేసి ఉంటే అసౌకర్యం ఉండేది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సరే అప్పుడంటే పిల్లలు లేరు కాబట్టి.. ఎవరకీ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు బడులు తెరుచుకున్నా.. ఇంకా ఇసుకను అక్కడి నుంచి తొలగించలేదు. పాఠశాల విరామ సమయంలో ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఇసుక రీచ్‌ల నుంచి నేరుగా ఆయా పాఠశాలలకు తరలించకుండా.. ఇక్కడ డంప్ చేయడం ఏంటని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం త్వరలోనే ఇసుక ఖాళీ అవుతుందని చెప్పుకొస్తున్నారు. నాడు-నేడు పనులు సకాలంలో జరిగి ఉంటే.. ఈపాటికి ఇసుక ఖాళీ అయ్యేదంటున్న గ్రామస్థులు.. జాప్యం వల్లే పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు.
ఇవీ చదవండి: