ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్పంచ్​ పదవికి వేలం.. రూ. 21,20,000 పలికిన వైనం - సర్పంచ్​ పదవికి వేలం.. రూ. 21,20,000 పలికిన వైనం

నెల్లూరు జిల్లాలోని రామనాయుడుపల్లి గ్రామ సర్పంచ్​ పదవికి గ్రామస్థులు వేలం పాట నిర్వహించారు. అనేకమంది ఔత్సాహికులు పాల్గొనగా చివరకు పోంగులూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 21లక్షల 20వేల రూపాయలకు సర్పంచ్​ పదవిని దక్కించుకున్నాడు.

sarpanch post auctioned in nellore district
సర్పంచ్​ పదవికి వేలం.. రూ. 21,20,000 పలికిన వైనం

By

Published : Jan 30, 2021, 9:19 PM IST

సర్పంచ్ పదివిని వేలం నిర్వహించి ఎకగ్రీవం చేసుకోగా.. వచ్చిన నగదును గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాలని కంకణం కట్టుకున్నారు అక్కడి యువకులు. నెల్లూరు జిల్లా రామనాయుడు‌ పల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి గ్రామస్థులు వేలం నిర్వహించారు. వచ్చిన నగదును గ్రామ అభివృద్ధి కొరకు ఉపయోగించాలని వారు నిర్ణయం తీసుకున్నారు.

హోరాహోరీగా జరిగిన వేలం పాటలో చాలామంది పాల్గొనగా.. చివరకు పోంగులూరి వెంకటేశ్వర్లు 21లక్షల 20వేల రూపాయలకు సర్పంచ్​ పదవిని దక్కించుకున్నాడు. అందరూ కలిసి అతనిని ఎకగ్రీవంగా ఎన్నికున్నారు. ఎవరు పోటీ చేయకుండా ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం‌ పోలీసులకు తెలియడంతో కాస్త హడావుడి చేయగా.. గ్రామస్థులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. విషయాన్ని మీడియాకు చెప్పడాని కూడా ముందుకు రాలేదు.

ABOUT THE AUTHOR

...view details