ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నామినేషన్ వేసినందుకు నన్ను గృహ నిర్బంధం చేశారు'

సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనను కొందరు వ్యక్తులు గృహనిర్బంధం చేశారని ఓ మహిళా అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

sarpanch candidate accused on her kidnap in nellore district
'నామినేషన్ వేసినందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు'

By

Published : Feb 8, 2021, 3:20 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెన్నవాడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు.. గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించిన కొందరు తనను గృహ నిర్భంధం చేసి బెదిరించారని స్వతంత్ర అభ్యర్థి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం సర్పంచి పదవిని రూ.21 లక్షలకు వేలంపాట నిర్వహించారని తెలిపారు.

ఈ క్రమంలో వారికి వ్యతిరేకంగా సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు.. దురుద్దేశపూర్వకంగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంకటలక్ష్మి వాపోయారు. ప్రభుత్వ అధికారులు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details