ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జెన్కో అధికారుల నిర్లక్ష్యంతో.. జనం నెత్తిన బూడిద - Jenko

Genco Thermal Power Station: నెల్లూరు జిల్లాలో జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో.. గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన రెండో యాష్ పాండ్‌లో పైపులైన్లు పగిలాయి. బూడిద నీరు పొంగిపొర్లి పంట కాలవలను ముంచెత్తాయి. పక్కనే ఉన్న దేవరదిబ్బ గిరిజన కాలనీలోకి చొరబడ్డాయి. గాలి, నీరు కాలుష్యంతో నిండిపోవడంతో.. గిరిజన కుటుంబాలు దిక్కు తోచని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఇళ్లలోకి వచ్చిపడిన బూడిదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

Genco Thermal Power Station
Genco Thermal Power Station

By

Published : Mar 13, 2023, 9:26 AM IST

Updated : Mar 13, 2023, 10:32 AM IST

జెన్కో అధికారుల నిర్లక్ష్యంతో.. జనం నెత్తిన బూడిద

Genco Thermal Power Station: నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పర్యావరణానికి హాని కలిగేలా అక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో బూడిద వచ్చి గ్రామాల మీద పడుతోంది . అక్కడి గ్రామాల మీద బూడిద పడుతున్నా అధికారులు ఏమీ పట్టనట్టు ఉంటున్నారు. కొందరు జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారలు కాసులకు కక్కుర్తి పడి నిబంధనలకు తూట్లు పొడుస్థున్నారు. ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి ప్రవర్తిస్తున్నారు. పైప్​ లైన్​ పగిలి అందులో నుంచి బూడిద యాష్ పాండ్ నుంచి గ్రామాల మీదకు వస్తుంది.. నేలటూరు పంచాయతీలోని జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల మీదకు బూడిద వచ్చి పడుతున్నా కనీసం పట్టించుకోకుండా ఏమీ పట్టనట్టు ఉండటం వల్ల అక్కడి జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జనం నెత్తిన బూడిద పడుతున్నా కనీసం పట్టించుకునే నాధుడు లేడని వారు వాపోతున్నారు. గ్రామంలోని శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన రెండో యాష్ పాండ్​లో పైపులైన్లు పగిలాయి.

అందులో నుంచి బూడిదతో కూడిన నీరు పొంగిపొర్లి బూడిద చెరువు కట్టలు కోసుకుపోయి పంట కాలవలను ముంచేశాయి. బూడిద నీరు.. పక్కనే ఉన్న గిరిజన కాలనీలోని ఇళ్ల చుట్టూ బూడిద నీరు చేరడంతో గాలి, నీరు కాలుష్యంతో నిండిపోయింది. సమీపంలో ఉన్న గిరిజన కుటుంబాలు దిక్కు తోచని పరిస్థితిలో కనీసం బయటకు రాలేని పరిస్థితితో జీవనం సాగిస్తున్నారు. దేవరదిబ్బ గిరిజన కాలనీకి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న యాష్ పాండ్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. అధికారుల వైఖరి ఈ ప్రమాదానికి కారణమన్న విమర్శలు ఉన్నాయి.. ఇంత జరుగుతున్నా జెన్కో అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పంట కాలువల్లోకి, ఇళ్లలోకి వచ్చి పడిన బూడిదతో తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని స్థానిక గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

ఒకటి, రెండు, మూడు యూనిట్ల ద్వారా యాష్​ పాండ్​ ఏది అయితే ఉందో అది రాత్ర తెగిపోయింది. అలా తెగినప్పటి నుంచి బూడిద నీరు కాలువల్లోకి, గ్రామాల్లోకి వచ్చి పొంగి పొర్లుతున్నాయి. యాష్​ పాండ్​ చుట్టు పక్కల గ్రామాల్లో బతుకుతున్న గిరిజనులు, ఎస్సీ, ఎస్టీలు ఈ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా నాశనం అయిపోయారు. ఇప్పటికైనా మేల్కొని ముందుకొచ్చి గిరిజనులను వలసలు వెళ్లకుండా కాపాడాలి.- రాజేష్ గ్రామస్థుడు

పైపు నుంచి బూడిద చాలా పెద్ద మొత్తంలో వచ్చి పడుతోంది. పిల్లలు బయటకు వస్తే బూడిద వాళ్ల కళ్లల్లో పడి అనారోగ్య బారిన పడుతున్నారు.. ఎంత మంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.- చెంచయ్య, గ్రామస్థుడు

ఇవీ చదవండి:

Last Updated : Mar 13, 2023, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details