నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరులో నారాయణ అనే పారిశుద్ధ్య కార్మికుడు బ్లీచింగ్ చల్లుతుండగా... స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రేవూరులో విషాదం... పారిశుద్ధ్య కార్మికుడు మృతి
నెల్లూరు జిల్లా రేవూరులో విషాదం నెలకొంది. బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ.. ఓ పారిశుద్ధ్య కార్మికుడు స్పృహ తప్పాడు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
పారిశుద్ధ్య కార్మికుని మృతితో ఆందోళన చేస్తున్న గ్రామస్థులు
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లనే నారాయణ మృతిచెందాడంటూ... ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఇదీచదవండి.