నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలో ముంబై జాతీయ రహదారిపై మరమ్మతులకు గురై ఆగి ఉన్న ఇసుక టిప్పర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మర్రిపాడు వద్ద ఇసుక టిప్పర్-బైకు ఢీ.. ఒకరు మృతి - మర్రిపాడు వద్ద రోడ్డుప్రమాదం
నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలో రోడ్డు మీద ఆగివున్న ఇసుక టిప్పర్ను బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు వ్రమాదం
మృతుడు భీమవరం గ్రామానికి చెందిన మూలి వెంకటేశ్వర్లుగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. పొంగూరు కండ్రిక వైపునుంచి మర్రిపాడు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి.ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!