ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోయిన అధికారులపై...దుండగులు ట్రాక్టర్‌తో సహా దూసుకెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా కోట మండలంలో జరిగింది. స్వర్ణముఖి నది వద్ద ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు... తిన్నులపూడి వద్ద దుండగులను అడ్డుకోబోయారు. ఎదురుగా వస్తున్న అధికారులపై దుండగులు ట్రాక్టర్‌తో దుసుకెళ్లి.. అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దాడిలో వాకాడు హెడ్ కానిస్టేబుల్ బషీర్, కానిస్టేబుల్ కోటయ్యకు గాయాలవ్వగా..గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా - నెల్లూరు జిల్లాలో అధికారులపై ఇసుక మాఫియా దాడి
నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి వచ్చిన అధికారులను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు దుండగులు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.
sand mafia attack on officials in nellore district