నెల్లూరు పెన్నా కొత్త వంతెన సమీపంలో ఇసుక అక్రమ తరలింపు ఆరోపణలతో.. ఆ ప్రాంతాన్ని అఖిలపక్ష నేతలు పరిశీలించారు. అధికార వైకాపాతోపాటు తెలుగుదేశం, భాజపా, జనసేన నేతలు.. ఇసుక తరలించిన ప్రాంతాన్ని చూశారు. ఈ క్రమంలో వైకాపా, తెలుగుదేశం నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
SAND ISSUE: ఇసుక అక్రమ తరలింపు ఆరోపణలపై పరిశీలన.. వైకాపా, తెదేపా నేతల మధ్య వాగ్వాదం - sand issue in Nellore district
నెల్లూరు పెన్నా కొత్త వంతెన సమీపంలో ఇసుక అక్రమ తరలింపు ఆరోపణలతో. అఖిలపక్షం నేతలు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో వైకాపా, తెదేపా నేతలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
sand issue in Nellore district
బయటి ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిపోయిందని తెలుగుదేశం నాయకులు ఆరోపించగా, ప్రభుత్వ ఇళ్ల స్థలాలకే తరలించామని వైకాపా నేతలు స్పష్టంచేశారు. నదీ ప్రాంతం నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు ఉన్నాయా లేవా, ఎంత పరిణామంలో ఇసుకను తరలించారు, ఇళ్ల స్థలాలకు ఎంత తరలించారు అనే వివరాలను అధికారుల వద్ద తీసుకుని, అసలు అవినీతి జరిగిందా లేదా అని ఓ నిర్దారణకు వస్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు.
ఇదీ చదవండి:డిజిటల్ పేమెంట్స్.. మరింత సురక్షితంగా