నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నది నుంచి పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు రోజూ సుమారు 80 ఎడ్లబండ్ల ఇసుకను ఇలా తరలిస్తున్నారు. వాస్తవానికి ఈ పనులకు పెళ్లకూరు మండలం పుల్లూరు రీచ్ నుంచి ఇసుకను తెచ్చుకోవాలని టెండర్ ఒప్పందంలో ఉంది.
ఈ విషయమై మున్సిపల్ ఏఈ సరితను 'ఈటీవీ భారత్' వివరణకోరగా.. ‘పుల్లూరు రీచ్ నుంచి ఇసుక దిగుమతి చేసుకునేలా టెండర్లలో చూపాం. స్థానికంగా తరలిస్తున్న విషయం మాకు తెలియదు. రీచ్ నుంచి దిగుమతి చేసినట్లుగా బిల్లులు పెట్టాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.