కరోనా కష్టకాలంలో ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులను పెద్ద సంఖ్యలో తొలగించటం దారుణమని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనందున ఇలాంటి చర్యలను వీడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని విమర్శించారు. స్వీయ నిర్బంధంలో ఉన్న ప్రజలను ఆదుకోవటంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు.
'ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించటం దారుణం'
ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించటం దారుణమైన చర్య అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను వీడనాడాలని హితవు పలికారు.
కరోనాను తక్కువ చేసి చూడకుండా, నిర్బంధంలో ఉన్న ప్రజల అవసరాలను తీర్చాలని కోరారు. కేంద్రాన్ని నిధులు ఇవ్వమని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు అడగడం లేదని శైలజానాథ్ ప్రశ్నించారు. పేదల కుటుంబాలకు పదివేల ఆర్థిక సహాయం చేసి, విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు.