పింఛన్లు పంపిణీ చేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులపై పోలీసులు అనుచితంగా దాడి చేశారంటూ... నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డి ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్.ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నగరంలోని 51వ వార్డులో పింఛన్లు పంపిణీ చేస్తున్న ఉద్యోగులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టారని ఆవేదన చెందారు.
మంత్రులు అనిల్, గౌతంరెడ్డి ఎదుట.. సచివాలయ ఉద్యోగుల ఆందోళన - మంత్రులు కాన్వాయ్‌ను అడ్డుకున్న సచివాలయ ఉద్యోగులు
పింఛన్లు పంపిణీ చేస్తున్న తమపై ఎస్.ఐ దురుసుగా ప్రవర్తించారని వార్డు సచివాలయ ఉద్యోగులు మంత్రులు అనిల్, గౌతంరెడ్డి ఎదుట ఆందోళనకు దిగారు. అతని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు.

మంత్రులు అనిల్, గౌతంరెడ్డి ఎదుట సచివాలయ ఉద్యోగుల ఆందోళన
TAGGED:
sachivalya employees protest