Rural Roads are Damaged by Sand Transport :ఇసుకాసురుల అరాచకాలు నెల్లూరు జిల్లాలో శ్రుతిమించాయి. పెన్నానదిని ధ్వంసం చేయడమే కాకుండా.. గ్రామీణ రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. అధిక లోడుతో వాహనాలను తిప్పుతూ భారీ గోతులుగా మార్చారు. రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దుమ్మూ.. ధూళితో గామాల్లో వాతావరణం కలుషితం చేస్తున్నారు. వాతావరణ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారు. పచ్చటి పంట పొలాలు, ఇసుక వాహనాల దుమ్ముతో నిండిపోతున్నాయి. గ్రామాల ప్రజలు, రైతులు ధర్నాలు చేస్తున్నా నెల్లూరు జిల్లాలో ఇసుక రవాణా అక్రమ రవాణా ఆగడం లేదు. పల్లెపాడు ఇసుక రీచ్‌కి వెళ్లే రోడ్డు దుస్థితే ఇందుకు నిదర్శనం.
People Facing Problems Due to Sand Transportation : నెల్లూరు జిల్లాలో ఆరు ఓపెన్ రీచ్‌లు, సంగం వద్ద రెండు డీసిల్టేషన్ రీచ్‌లు ఉన్నాయి. ఓపెన్ రీచ్‌లకు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారు. పెన్నా నది పొర్లు కట్టలను దెబ్బతీస్తున్నారు. అధిక లోడ్‌తో గ్రామీణ రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. ఇది పల్లెపాడు రోడ్డు దుస్ధితి ఇది..
జిల్లాలో ఇసుక రవాణా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంది. రీచ్‌లలో ఇసుక తూకం వేసి తనిఖీలు చేసే నిబంధనలు పాటించడం లేదు. 14 టైర్ల లారీల్లో 30 టన్నులు సామర్ధ్యంతో మాత్రమే తీసుకుపోవాలి. నిబంధనలు పాటించకుండా క్యాబిన్ స్దాయి వరకు పోసి 45 టన్నులు ఇసుకను లోడ్ చేసి తీసుకుపోతున్నారు.
Roads Damaged In Nellore :వేబ్రిడ్జి లేకపోవడంతో ప్రొక్లైయిన్ బకెట్లతో కొలతలు వేస్తున్నారు. 15 బకెట్లు పోస్తే 30 టన్నుల ఇసుక కొలత వస్తుంది. డబ్బులు కోసం అదనంగా ఐదు బకెట్లకు పైగా పోసి లారీల్లో నింపి పంపిస్తున్నారు. ఇంత బరువును తట్టుకునే సామర్ధ్యం గ్రామీణ రోడ్లకు లేవు. నాలుగు సంవత్సరాలుగా రోడ్లు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.