రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మికులు ప్లకార్డులతో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేశారు. విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా బీమా రూ. 50 లక్షలు వర్తింపజేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజినల్ ఉపాధ్యక్షుడు యస్ధాని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల వద్ద ఆర్టీసీ ఉద్యోగులకు విధులు కేటాయించే విధానాన్ని విరమించుకోవాలన్నారు. డీజిల్ పై కేంద్రం పెంచిన రూ.13 అదనపు భారాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మార్చి, ఏప్రిల్ నెల జీతాల్లో మిగిలిన 50 శాతం వెంటనే చెల్లించాలన్నారు.
కరోనా బీమా కోరుతూ ఆర్టీసీ కార్మికుల నిరసన - RTC Emplyees Protest against govt
కరోనా నేపథ్యంలో కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ డిపో వద్ద ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
కరోనా బీమా కోరుతూ ఆర్టీసీ కార్మికుల నిరసన
ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యుఎఫ్ డిపో అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మాజీ కార్యదర్శి సుదర్శన్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరు మృతి