నెల్లూరు ఆర్టీసీ డిపోలో పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నమోదు కావడం సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతుంది. రెండు డిపోల పరిధిలో సుమారు 600 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. రెండు రోజులుగా రెండు డిపోల పరిధిలో పనిచేసిన పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నమోదు అయ్యింది. దీంతో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
భద్రత లేదంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన - RTC employees protest news
నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ, కలెక్టర్ కార్యాలయం, రీజీనల్ కోవిడ్ సెంటర్ జీజీహెచ్, పోలీసు స్టేషన్లలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు నిరసనకు దిగారు. భద్రతపరంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి రక్షణ పరికరాలు ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రత లేదంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన
ప్రతి రోజు అనేక డిపోల నుంచి బస్సులు, ప్రయాణికులు వస్తున్నారని. అయినప్పటికీ అధికారులు భద్రతపరమైన చర్యలు తీసుకోవడంలేదని నిరసన తెలిపారు. బౌతికదూరం పాటిస్తూ డిపో వద్ద ఆందోళన చేపట్టారు. సిబ్బందికి పీపీఈ కిట్లు లేవని, కనీసం శానిటైజేషన్ పరికరాలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన చెందారు. మాస్కులతో సరిపెట్టారని, భద్రత లేకుండా ఏ విధంగా ఉద్యోగాలు నిర్వహిస్తామని అర్టీసీ సిబ్బంది ప్రశ్నించారు.
ఇవీ చూడండి...