ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో ఆర్టీసీ కార్మికుల నిరసన - corona news in nellore dt

కరోనా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు అందజేయాలని నెల్లూరు ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల ముందు ఆర్టీసీ కార్మికులను నియమించటంపై వారు ఆగ్రహిం వ్యక్తం చేశారు.

RTC employees demadns  for mask and sanitizers in nelloore dst
RTC employees demadns for mask and sanitizers in nelloore dst

By

Published : May 8, 2020, 9:08 PM IST

కరోనా విధులకు వెళ్తున్న తమకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ... నెల్లూరులో ఆర్టీసీ కార్మికులు నిరసన చేశారు. వలస కార్మికులను తరలించేందుకు వెళ్తున్న తమకు శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు అందజేయాలని కోరారు. అధికారులు మాత్రం మాస్కులు తప్ప ఏమి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మద్యం దుకాణాల వద్ద విధులకు నియమించడం దారుణమన్నారు. జిల్లాలో మద్యం దుకాణాల వద్ద నియమించిన 142 మంది కార్మికులను వెనక్కి పిలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details