ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేరమిట్ట గ్రామానికి చెందిన మల్లికార్జునరావు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. బెంగళూరు సర్వీసుకు ఒకే డ్రైవర్ వెళ్లాలంటే కష్టంగా ఉందని తనతో పాటు మరొక డ్రైవర్ను ఏర్పాటు చేయాలని అధికారులను కోరాడు. అందుకు డిపో అధికారులు అంగీకరించకపోవడం వల్ల మనస్తాపం చెందిన మల్లికార్జునరావు పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. డిపో మేనేజర్ ప్రతాప్ కుమార్ వైద్యశాలకు వచ్చి డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకున్నారు.
ఉదయగిరి ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్ ఆత్మహత్యాయత్నం - ఉదయగిరి డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్ మల్లికార్జునరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డిపో అధికారులు వెంటెనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉదయగిరి డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఉదయగిరి డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఇవీ చదవండి: