లాక్డౌన్ కారణంగా సుమారు రెండు నెలలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సుల రాకపోకలు పున ప్రారంభమయ్యాయి. ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి నెల్లూరు, కావలి, బద్వేలు, సీతారామపురం మార్గాల్లో 17 బస్ సర్వీసులు నడిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయగిరి ఆర్టీసీ డిపో బస్టాండ్ ప్రాంగణం నుంచి బస్సు సర్వీసులను నిర్దేశించిన ప్రాంతాలకు నడిచేలా డిపో మేనేజర్ ప్రతాప్ కుమార్ ఏర్పాటు చేశారు. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించడమే కాకుండా సీట్లలో గుర్తులు వేసిన దగ్గర కూర్చునేలా చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం డిపో నుంచి నిర్దేశించిన మార్గాల్లో బస్సులో నడుపుతున్నామని డిపో మేనేజర్ వివరించారు.
ఉదయగిరిలో బస్సుల ప్రారంభం - ఉదయగిరి తాజా ఏపీఎస్ఆర్టీసీ వార్తలు
కరోనా నేపథ్యంలో సుమారు రెండు నెలల పాటు రోడెక్కని ఆర్టీసీ బస్సులు... గురువారం ఉదయం నుంచి పునఃప్రారంభమయ్యాయి. లాక్డౌన్ సడలింపు వల్ల పరిమిత ఆంక్షలతో బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో ఉదయగిరి డిపో ప్రాంగణమంతా బస్సులతో కళకళలాడింది.
ఉదయగిరిలో రోడెక్కిన ఆర్టీసీ బస్సలు