ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని నెల్లటూరు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. అందులోని ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. మొదటగా ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బస్సు పక్కనే ఉన్న చెట్టుకు బలంగా తగిలి ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా.. డ్రైవర్​తో పాటు.. ఓ వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి.

rtc bus hits tree in nellore
చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

By

Published : Jan 5, 2021, 6:48 PM IST

నెల్లూరు జిల్లా గూడూరు - వెంకటగిరి మార్గంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. గోగినేనిపురం నెల్లటూరు సమీపంలోకి రాగానే.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బస్సు.. వెంటనే పక్కనే ఉన్న చెట్టును ఢీ కొని ఆగిపోయింది. ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరితో పాటు.. బస్సు డ్రైవర్, అందులో ఉన్న ఓ వృద్ధురాలు.. మొత్తంగా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.

బాధితులను గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బస్సు వెంకటగిరి నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details