వ్యవసాయంపై మక్కువ ఉన్న యువ రైతులకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇచ్చి.. వారికి ఆర్థిక సాయం చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తుందని నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శివ జ్యోతి తెలిపారు. ఇంట్లోనే పుట్టగొడుగుల పెంచడానికి ప్రభుత్వం ద్వారా రూ.15 వేలు రాయితీ అందిస్తామని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పుట్టు గొడుగులు పెంపకానికి రూ.15 వేలు రాయితీ - నెల్లూరు జిల్లాలో వ్యవసాయం
యువరైతులకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇచ్చి, వారికి ఆర్థిక సహాయం చేస్తామని నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్యయకర్త తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పుట్టు గొడుగులు పెంపకానికి రూ.15 వేలు రాయితీ