భక్తి, విశ్వాసాలను ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ వైభవంగా సాగుతోంది. రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచి బారీగా భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులతో దర్గా ప్రాంగణమంతా రద్దీగా మారింది. బారాషాహీద్ సమాధులను భక్తులు దర్శించుకుంటున్నారు. స్వర్ణాల చెరువు దగ్గర భక్తులు కొర్కెల రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.
నెల్లూరులో రొట్టెల పండగ..తరలివస్తున్న ప్రజలు
నెల్లూరులో రొట్టెల పండగ ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజే బారాషహీద్ దర్గాకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
నెల్లూరు రొట్టెల పండుగ