9నుంచి రొట్టెల పండుగ..కొనసాగుతున్న ఏర్పాట్లు - సెప్టెంబర్ 9నుంచి రొట్టెల పండుగ
బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి అనిల్ హాజరయ్యారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది.

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. దర్గా వద్ద రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా రజాక్, వైస్ ఛైర్మన్‌గా మున్నా తోపాటు మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి జరిగే రొట్టెల పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు రానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.