నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రధాన బజార్లు ప్రజలతో రద్దీగా మారుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలను పాటించకుండా జనం భారీగా రోడ్లపైకి చేరుతున్నారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 9 గంటల వరకే సమయం ఉండటంతో దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. దుకాణాల వద్ద కనీసం వ్యక్తిగత దూరం పాటించడం లేదు. మరోవైపు పోలీసులు రద్దీని నియంత్రించడానికి యత్నిస్తున్నా ఫలితం లేకపోతుంది.
తీరు మారాలి.. ఇలా ఉంటే కరోనా నివారణ ఎలా..?
కరోనా నివారణకు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నా.. కొందరి తీరు మారడం లేదు. నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన సమయంలో గుంపులుగా రోడ్లపైకి చేరుతున్నారు. భౌతిక దూరాన్ని ఏ మాత్రం పాటించటం లేదు. నెల్లూరు జిల్లాలో లాక్డౌన్ అమలవుతున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
crowd