నెల్లూరు జిల్లాలో కలువాయి మండంలోని వేరుబొట్లపల్లి, వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవలి వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వర్షాలకు రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దీంతో విసుగు చెందిన గ్రామస్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. బురద రోడ్లపై వరినాట్లు వేశారు.
రోడ్లు బురదమయం... నడక నరకప్రాయం - నెల్లూరులో రోడ్లు బురదమయం వార్తలు
నెల్లూరు జిల్లా కలువాయి మండంలోని గ్రామాల్లో రోడ్లు నరకప్రాయంగా మారాయి. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతున్నాయి. మండల కేంద్రానికి కలిసే రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయి. గుంతల రోడ్లపై రాకపోకలు సాగించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురిస్తే అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. నడిరోడ్డుపై నాట్లు నాటారు.
కానుపూరుపల్లి పంచాయతీ వేరుబొట్లపల్లి ఎస్సీ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. రోడ్ల మీద నడవడం కష్టంగా మారిందంటున్నారు. వెంకటరెడ్డిపల్లి గ్రామంలో సచివాలయం దగ్గర ప్రధాన రోడ్డు గుంతలమయంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు. 300 ఇళ్లున్న గ్రామంలో చాలా ఏళ్ల నుంచి రోడ్లు వేయలేదన్నారు. నిరసనగా గ్రామస్థులంతా బురదరోడ్లపై నాట్లు వేశారు. సచివాలయాన్ని మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయించాలని కోరారు.
ఇదీ చదవండి :బాలికను అపహరించారు.. రూ.30 వేలకు అమ్మేశారు