ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - పెళ్లకూరు లో రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లాలో పెళ్లకూరు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలు ఢీ కొట్టిన ఘటనలో.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిన సమీపంలో ఆస్పత్రికి తరలించారు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

By

Published : Mar 16, 2021, 7:52 AM IST

Updated : Mar 16, 2021, 10:26 AM IST

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం... మోదుగుపాలేనికి చెందిన కూలీలు వెళ్తున్న ఆటోను తొలుత టిప్పర్‌ ఢీకొనగా ఆ ఆటో ఓకారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మంది కూలీల్లో ఇద్దరు మృతి చెందారు.

ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న నాయుడు పేట సీఐ వేణుగోపాల్​రెడ్డి, పెళ్లకూరు ఎస్సై మనోజ్ కుమార్​... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిని మరో ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యల రోదనలు మిన్నంటాయి.

Last Updated : Mar 16, 2021, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details