నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆత్మకూరు మండలం బోయల చిరివెళ్ల గ్రామానికి చెందిన రాము (24) అనే యువకుడు మృతి చెందాడు. కృష్ణమూర్తి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.
లారీని ఢీ కొట్టిన బైక్.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు - నెల్లూరు రోడ్డు ప్రమాద వార్తలు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
లారీని ఢీకొన్న బైక్..ఒకరు మృతి మరోకరికి తీవ్రగాయాలు