Accident: నెల్లూరు జిల్లాలో కారు-లారీ ఢీ..ఇద్దరు మృతి - నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం
07:33 August 21
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కృష్ణా జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి