నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలం కాగులపాడు గ్రామంలో ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను.. మినీలారీ ఢీకొట్టింది. వేగంగా వాహనాలు ఢీ కొనటంతో ట్రాక్టర్‌ను.. లారీ కొంత దూరం వరకు ఈడ్చుకు వెళ్లింది. ట్రాక్టర్ డ్రైవర్ రాజేశ్‌కు కాలికి తీవ్ర గాయం కావటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం దాటికి రహదారిపై వడ్లు చెల్లాచెదురుగా పడ్డాయి.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు - నెల్లూరు జిల్లా నేర వార్తలు
నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలంలో ట్రాక్టర్‌ను...మినీ లారీ ఢీకొట్టడంతో రాజేశ్ అనే వ్యక్తి కాలికి తీవ్ర గాయమైంది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.
![వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11535986-732-11535986-1619362167227.jpg)
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఓ ఇన్నోవా కారును, మూడు ద్విచక్రవాహనాలను.. మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. కారు పల్టీలు కొట్టినప్పటికీ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.