నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక సమీపంలో నెల్లూరు- ముంబయి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓమిని కారు ఢీకొట్టింది. ఇదే క్రమంలో ఓమిని కారు వెనుక ఉన్న మరో కారును ఎదురుగా వస్తున్న వేరొక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరు మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు కారులు నెల్లూరు వైపు నుంచి బద్వేలు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మర్రిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు - raod accident news in nellore district
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు, అదే చోట మరో కారును వేరొక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి.

మర్రిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం