నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో వేగంగా వచ్చిన ఓ కారు..ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు, చెరుకుపల్లి గ్రామాల నుంచి రెండు కుటుంబాలకు చెందిన 11 మంది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం దైవదర్శనానికి ఆటోలో బయలుదేరారు. ఆటో నందిపాడు నాలుగు రోడ్ల కూడలికి వచ్చే సరికి ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. దుత్తలూరు ఎస్సై జంపానీ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆటోను ఢీకొట్టిన కారు... పలువురికి గాయాలు - నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదం
వేగంగా వచ్చిన ఓ కారు..ఆటోను ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది స్వల్పంగా గాయపడ్డారు.
ఆటోను ఢీకొట్టిన కారు... పలువురికి గాయాలు