నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టు రహదారిపై రోడ్డు కుంగి ఉన్న కారణంగా.. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
కల్వర్టు వద్ద జాతీయ రహదారి కుంగిపోయి ఉండటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.