బైకును ఢీకొన్న లారీ... ఒకరు మృతి - latest crime news nellore district
నెల్లూరు జిల్లా చిల్లకూరు వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరోకరు గాయపడ్డారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతి చెందిన మహిళ
నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి గూడూరు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి వచ్చి లారీ ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై వెనక కూర్చున్న బత్తులపల్లి అరుణ(37) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న నారపరెడ్డి మధు అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.