వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరుపతి నుంచి నెల్లూరుకు కారు వేగంగా దూసుకెళుతోంది. అదే సమయంలో పాదలకూరు నుంచి హైవే పైకి వెళ్లేందుకు కట్టేల లారీ రోడ్డు దాటుతోంది. స్పీడ్‌గా వచ్చిన కారు లారీని ఢీ కొట్టింది.
వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం.. నలుగురికి తీవ్రగాయాలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
road accident at nellore district veerampalli cross road